
*పత్రికా ప్రకటన*
*ఈ నెల 8 నుండి 12 వరకు తుడా టవర్స్ లోని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఈ – వేలం*
*తిరుపతి మార్చి 2:* ఈ నెల 8 నుండి 12 వరకు తుడా టవర్స్ లోని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఆన్ లైన్ నందు ఈ – వేలం ప్రక్రియ నిర్వహించ బడుతుందని తుడా వైస్ చైర్మన్ శ్రీమతి ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి పట్టణములోని అన్నమయ్య సర్కిల్ మరియు ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపములో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థచే ప్రతిష్టాత్మకoగా G+13 అంతస్తులతో *తుడా టవర్స్* భవన నిర్మాణాన్ని 3.60 ఎకరాలలో, 8,28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.345 కోట్ల అంచనా వ్యయంతో 2023 సంవత్సరంలో అన్ని ప్రభుత్వ అనుమతులతో (Airport Authority, fire department మరియు RERA) నిర్మాణం చేపట్టడం జరిగినదని, ఇప్పటి వరకు 6 అంతస్తులలో నిర్మాణ పనులు పూర్తయి 7వ అంతస్తు నిర్మాణము పురోగతిలో ఉన్నదని తెలిపారు. ఈ నిర్మాణము 2026 ఏప్రిల్ మాసంలోపు పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు . ఈ నిర్మాణంలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ తో పాటు వాణిజ్య మరియు కార్యాలయాల అవసరాలకు కూడా నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు .
ఇందులో బేస్మెంట్ పార్కింగ్ సదుపాయం కొరకు, గ్రౌండ్ + మొదటి అంతస్తులో దాదాపు 1,20,000 చ.అడుగుల విస్తీర్ణములో వాణిజ్య సదుపాయం కొరకు, రెండవ అంతస్తు నుండి 5వ అంతస్తులో దాదాపు 90,000 చ.అడుగుల విస్తీర్ణములో వివిధ కార్యాలయాల సదుపాయాల కొరకు కేటాయించడం జరిగిందని తెలిపారు.
అలాగే నివాస గృహాలకు సంబంధించి 2వ అంతస్తు నుండి 13 వ అంతస్తు వరకు 1235 చ.అడుగుల 2 BHK ఫ్లాట్స్ – 46, అలాగే 1900 చ.అడుగుల 3 BHK ఫ్లాట్స్ – 152 మరియు 3740 చ.అడుగుల 4 BHK ఫ్లాట్స్ -32 వెరసి మొత్తం 230 నివాస భవనముల నిర్మాణాలు జరుతున్నాయని, అలాగే నివాసితులకు స్విమ్మింగ్ పూల్, జిమ్(GYM), షటిల్ కోర్ట్, ల్యాండ్ స్కేపింగ్ పోడియం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్ మొదలగు ఆధునిక సౌక్యరములతో పాటు రెసిడెన్షియల్, వాణిజ్య భవనములకు ప్రత్యేక ఎంట్రీ మరియు ఎగ్జిట్ (entry and exit) వసతిని కల్పించడం జరుగుతోందని అన్నారు. తగిన వసతులతోపాటు ఇక్కడి నుండి తక్కువ సమయంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ మరియు నేషనల్ హైవే వంటి ప్రాంతాలు చేరడానికి అత్యంత అనువుగా ఈ తుడా టవర్స్ ఉన్నాయని తెలిపారు.
ఈ తుడా టవర్స్ లోని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కు ఆన్లైన్ పద్ధతిలో ఈ -వేలం ప్రక్రియ మార్చి నెల 8వ తేది నుండి 12వ వరకు నిర్వహించబడుతుందని, ఆసక్తి కలవారు పాల్గొనవచ్చునని మరియు తుడా టవర్స్ నందు నిర్మించిన “Model Flat”ను పరిశీలించవచ్చునని తెలిపారు. ఇతర వివరాల కొరకు tudaap.in మరియు tudatowers.in వెబ్సైట్స్ నందు పరిశీలించవచ్చని దినదినాభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో తుడా సంస్థ ప్రతిష్టాత్మకoగా చేపట్టిన ఈ భవన నిర్మాణము ప్రభుత్వ నిబంధనలతో పాటు అన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్ణయించిన కాలవ్యవధిలో పూర్తి చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తుడా విసి ఆ ప్రకటనలో తెలిపారు.
—————————————-
*డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి*

