
శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్. కోటేశ్వర్ బాబు చేతుల మీదుగా..
ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యవసర సరుకులు పంపిణీ.
శ్రీకాళహస్తి మార్చ్ 2 (గరుడ దాత్రీ న్యూస్): హెల్పింగ్ హాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో 159 నెల దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డా. వై. కోటేశ్వరబాబు విచ్చేసి వారికి ముందుగా. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వారికి స్వాగతం పలికి సాలువాతో సన్మానించారు,అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వర బాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరబాబు మాట్లాడుతూ పేదలకు సాయం చేస్తున్న మునీర్ భాష కు అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాషా మాట్లాడుతూ ఆంధ్ర శ్రీ అవార్డు గ్రహీత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వర బాబు కరోనా సమయంలో ప్రజలకు తన వంతు సాయం చేశారని, అంతేకాకుండా మూగజీవాల ఆకలి తీర్చడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది అన్నారు. పదోతరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో విద్యాసామాగ్రి అందిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాష, న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

