
*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ*
నారాయణవరం మండలం కళ్యాణపురం లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.
శనివారం ఒకటో తేదీ రావడంతో ఉదయం నారాయణవనం మండలం కళ్యాణపురంకు చేరుకున్న ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులు కలుసుకొని పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం ద్వారా పేదలకు పింఛన్లు ను వెయ్యి రూపాయలు పెంచి పంపిణీ చేస్తుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఆ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

