Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అక్రిడేషన్ గడువు పొడిగింపు! జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్ 

అక్రిడేషన్ గడువు పొడిగింపు!

* జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్

*

తిరుపతి కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మూడు నెలలు పాటు మార్చి 1, 2025 నుండి మే 31, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, ఐఏఎస్, గురువారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఫిబ్రవరి 28, 2025 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే మార్చి 1, 2025 నుండి మే 31, 2025 వరకు పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని, సంబంధిత మీడియా యాజమాన్యం వారి సంస్థలో పని చేయుచున్న జర్నలిస్టుల వివరాలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, తిరుపతి వారి కార్యాలయంలో వీలైనంత తొందరగా అందచేయాలని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్ తెలియజేశారు.

 

Related posts

అంగరంగ వైభవంగా కైలాసకోన దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం

Garuda Telugu News

తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు ఆమోదం..

Garuda Telugu News

బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి ప్రస్తుతం ఐ.ఐ.టి. S.Yలో మణిపూర్‌లో చదువుకున్నారు

Garuda Telugu News

Leave a Comment