
శ్రీశైలం దేవస్థానం నుంచి శ్రీకాళహస్తి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు
శ్రీకాళహస్తి ఫిబ్రవరి 21 (గరుడ దాత్రీ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీశైలం దేవస్థానం నుంచి స్వామి అమ్మ వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి.బాపిరెడ్డి, డిప్యూటీ ఈ.వో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి,ఏఈఓ లోకేష్ రెడ్డి,సూపర్డెంట్ అండ్ సి.ఎస్.ఓ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్,సుదర్శన్ దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

