
*ఈ నెల 23న తిరుపతి జిల్లా సిఎం పర్యటన సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల తనిఖీ (ఎఎస్ఎల్) లో భాగంగా ఎస్పీ తో కలిసి సమీక్షించి, సిఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్*
*సిఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్*
*ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాట్లు: ఎస్పి హర్ష వర్ధన్ రాజు*
రేణిగుంట, ఫిబ్రవరి21: గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23 తేదీన ఆదివారం నాడు తూకివాకం సమీపంలోని ఆర్పిఆర్ కళ్యాణం మండపం నందు నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పి సంయుక్తంగా అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నందు సిఎం పర్యటన ఏర్పాట్లపై ASL లో( ముందస్తు భద్రత లైజన్) జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 23వ తేదీన ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రేణిగుంట మండల పరిధిలోని తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ కల్యాణ మండపంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూ వరులను ఆశీర్వదించి తిరుగుప్రయాణం కానున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై (AsL) సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశనం చేశారు.
ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు రవి మనోహరాచారి, శ్రీనివాసులు, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ బాలాజీ నాయక్, జిల్లా అధికారులు, విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మన్నే, తహశీల్దార్ సురేష్ బాబు, తదితర అధికారులు పాల్గొన్నారు.

