
తిరుపతి
శ్రీవారి మెట్టు మార్గంలో 1150 మెట్ల వద్ద నల్గొండ వాసి ఫిట్స్ రావడంతో అస్వసతకు గురయ్యాడు
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్లు నడక మార్గం నుండి తిరుమల దర్శనానికి వెళ్తున్న భక్తుడు 1150 మెట్ల వద్ద ఫిట్స్ తో ( మూర్చ వ్యాధి తో ) జైపాల్ నల్గొండ వాసి అనారోగ్యానికి గురి అయ్యాడు. సకాలంలో స్పందించిన టిటిడి విజిలెన్స్ మరియు మెడికల్ సిబ్బంది మెట్ల మార్గం ద్వారా కిందికి తీసుకొచ్చి అత్యవసర చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించారు. మూడు రోజుల క్రితం శ్రీవారి మెట్టు మార్గంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ కు చెందిన వ్యక్తి మరణించిన విషయం తెలిసిన విషయమే. శ్రీవారి మెట్టు మార్గం మధ్యలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కావున టీటీడీ అధికారులు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

