
దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని 27 ఏళ్ల తర్వాత దక్కించుకున్న బిజెపి నగరిలో కూటమి నాయకుల సంబరాలు…*
ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నేతలు శనివారం సాయంత్రం టవర్‌క్లాక్ సెంటర్‌లో బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ప్రధానమంత్రి పరిపాలనా దక్షతే విజయానికి కారణమని నినాధాలు చేశారు. “తోకముడిచిన అమ్ ఆద్మీ పార్టీ ” ‘అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ “అని కూటమి నాయకులు ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయుడు, జిల్లా నాయకులు రామూర్తియాదవ్, వేలాయుధం, మోహన్, మండల అధ్యక్షులు హరి, రూరల్ అధ్యక్షులు సతీష్‌కుమార్, టీడీపీ నాయకులు గుణశేఖర్, జ్యోతినాయుడు, కృష్ణారెడ్డి, రమేష్, జనసేన పార్టీ మండల వీర మహిళ కోమల తదితరులు పాల్గొన్నారు.

