
*తిరుపతి లో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *ఎమ్మెల్యే థామస్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఆదిమూలం*
✍️ *స్విమ్స్ లో చికిత్స పొందుతున్న టిడిపి నేతలకు ఎమ్మెల్యే పరామర్శ*
శనివారం తిరుపతిలో పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని బిజీ బిజీ గా గడిపారు.
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తిరుపతిలో నూతనంగా ఆస్పత్రిని నిర్మించి శనివారం ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డాక్టర్ థామస్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
అక్కడ నుండి స్విమ్స్ ఆస్పత్రికి చేరుకొని అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నారాయణవనం కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధర్మలింగంను ప్రరామర్శించారు.
అలాగే బుచ్చినాయుడు కండ్రిగ మండలానికి చెందిన మరో టిడిపి నేతను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని, బాధితులు త్వరగా కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

