
*మా తెలుగు టీచర్ తొండు కృష్ణయ్య గారు మాకు టీచర్ గా కావాలి* (AISF )
శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం హై స్కూల్ నందు తెలుగు టీచర్ గా
తొండు.కృష్ణయ్య 5సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఆయనపై కథ కొన్ని రోజులుగా అదే పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న భాను అనే విద్యార్థిని తనతో అసభ్యంగా మాట్లాడారని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఆయనని శుక్రవారం రోజున సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల విద్యార్థులు ,విద్యార్థుల తల్లిదండ్రులు మరియు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు ఈరోజు పాఠశాల వద్ద నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది ఆయన మీద వచ్చిన ఆరోపణని పాఠశాల అంతర్గత విషయాలలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణయ్య గారి తప్పేమీ లేదని పాఠశాల విద్యార్థులు విద్యార్థినిల తల్లిదండ్రులు ఏఐఎస్ఎఫ్ నాయకులు మరియు పాఠశాల యజమాన్యం మరియు సంబంధిత ఎంఈఓ భారతి గారు అందరూ విచారించి నిర్ణయం తీసుకొని డి ఈ ఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది కావున రానున్న పదవ తరగతి పరీక్షల కారణంగా మరియు ఆయన మీద చేసిన ప్రచారాన్ని తిరస్కరిస్తూ అది ఒక ఆరోపణ మాత్రమే నని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ లెటర్ పెట్టడం జరిగింది మళ్లీ ఆయన ఆ పాఠశాలకు తిరిగి రావాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరు కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి .ముని చందు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

