
*సామాజిక కార్యకర్త మల్లీశ్వరి కి డాక్టరేట్*
✍️ *ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్*
✍️ *దైవత్వ మరియు సామాజిక సేవలను గుర్తించి అరుదైన గౌరవం*
✍️ *పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ టీచర్ గా ఉంటూనే ధ్యానం ద్వారా సామాజిక సేవలు..*
✍️ *సంతోషంగా ఉంది.. మరింత సేవ చేయాలని ఉంది* *: మల్లీశ్వరి*
పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ హిందీ పండిట్, సామాజిక కార్యకర్త రాయల మల్లీశ్వరి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్ అందుకొనున్నారు.
డివినిటీ మరియు సోషల్ సర్వీస్ అనే అంశంపై ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ ఆమెను గుర్తించి ఆదివారం హైదారాబాద్ లో డాక్టరేట్ ప్రదానం చేయనుంది.
మల్లీశ్వరి పిచ్చాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్ గా విధులు నిర్వహిస్తూ.. శెలవులు మరియు సాయంత్రం వేళల్లో తిరుపతి పరిసర ప్రాంతాలు వారికి.. తాను పనిచేసే పాఠశాల చుట్టు ప్రక్కల వారికి ఉచితంగా ధ్యానం నేర్పించడంతో పాటు USA లో ఉన్న వారికి సైతం జూమ్ క్లాసులు ద్వారా ధ్యానం నేర్పుతూ సామాజిక సేవా చేస్తున్నారు.
ప్రతి బుధవారం సాయంత్రం వేళల్లో తిరుమల లోని శ్రీవారి సేవకులకు, ఉద్యోగులకు టీటీడీ అనుమతితో మల్లీశ్వరి ధ్యానం నేర్పిస్తూ వారిలో ఏకాగ్రతను పెంపొందిస్తూ ఆరోగ్యవంతులుగా, ఉత్సాహవంతులుగా నడిపించడానికి సేవలందిస్తున్నారు.
*ధ్యానం, మొక్కలు పెంపకం ఆవశ్యకతను ప్రజలధరికి చేర్చాలి*
ధ్యానం, మొక్కలు పెంపకం ఆవశ్యకతను ప్రజలధరికి చేర్చాలన్నదే లక్ష్యంగా సేవ చేయాలని డాక్టర్ రాయల మల్లీశ్వరి అన్నారు.
తనకు డాక్టరేట్ రావడం పట్ల సంతోషంగా ఉందని, దీనివల్ల రెట్టింపు ఉత్సాహంతో తన సేవలను మరింత విస్తృతం చేస్తానన్నారు.
అందరి సహకారంతో పత్రిజీ ధ్యానం ను ప్రతి కుటుంబంలో నేర్చుకొని నిత్యం ఆచరించేందుకు, విస్తారంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపుకు తన వంతు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
తన సేవలను గుర్తించి తనకు డాక్టరేట్ ప్రధానం చేయడానికి ఎంపిక చేసిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ కి, తాను ఈ స్థాయికి ఎదగడానికి సహకరించిన గురువులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

