Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో దంపతుల ఆత్మహత్య

బ్రేకింగ్ న్యూస్

 

తిరుమలలో దంపతుల ఆత్మహత్య

తిరుమల: తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు (60), ఆయన భార్య అరుణ (55) తిరుమల శ్రీవారి దర్శానికి వచ్చారు. నందకం అతిథి గృహంలోని గది నెంబర్ 203ను అద్దెకు తీసుకున్నారు. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి కాటేజీలో ఆత్మహత్య చేసుకోవటం, అందులోనూ భార్యాభర్తలు ఇలా తిరుమలలో చనిపోవాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య సమాచారాన్ని తిరుపతిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. పిల్లలు, బంధువులు కొండకు వచ్చి పోలీస్ విచారణకు హాజరయ్యారు.

 

Related posts

టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

Garuda Telugu News

నాగలాపురం మండలంలో డిస్టిక్ ఎస్సి సెల్ కమిటీ మెంబర్ బి ఈశ్వర్ గారి పుట్టినరోజు పండగగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి వైస్ ప్రెసిడెంట్ మదన్మోహన్ రెడ్డి గారు చేతులమీదుగా సాలువులు వేయడం…!

Garuda Telugu News

నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం

Garuda Telugu News

Leave a Comment