
వీ కే ఆర్ వై కాలనీలో కొనసాగుతున్న అక్రమ కట్టడాలు
👉 చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
✅ తిరుపతి జిల్లా వరదయ్యపాళ్యం మండలం వి కే ఆర్ వై గిరిజన కాలనీ వద్ద అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల వి కె ఆర్ వై గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు.. అయితే తాసిల్దార్ కు అందిన ఫిర్యాదుల మేరకు పనులను నిలుపుదల చేశారు.
👉 తాజాగా వికేఆర్వై కాలనీ కూడలి నుండి హీరో పరిశ్రమకు వెళ్లే మార్గంలో కుడిచేతివైపుగా రాచర్లకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎలక్ట్రిక్ సిటీ డిఈగా విభాగం కు చెందిన అయిన ఆయన ..అక్రమంగా ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి నిర్మాణాలను దర్జాగా చేపడుతున్నారు.
👉 అయితే ఇంత జరుగుతున్నా..నియంత్రించాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. అంతేగాక పట్టపగలే నిర్మాణాలు జరుగుతున్నా.. రెవిన్యూ అధికారుల నుండి ఏమాత్రం స్పందన లేదు.
👉ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గ్రామస్థాయిలో అక్రమ కట్టడాలు మరియు బెల్ట్ దుకాణాలను నియంత్రించాలని ఆ గ్రామస్తులు కోరారు.

