Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఒంటరి మహిళను టార్గెట్ చేసి దోపిడీ చేసిన ముగ్గరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్టు

*తిరుపతి జిల్లా…*

 

*ఒంటరి మహిళను టార్గెట్ చేసి దోపిడీ చేసిన ముగ్గరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్టు*

 

*సుమారు ౩౦ లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణములు (280 గ్రాములు), 08 లక్షల విలువైన ఒక కారు, మరియు 02 మోటార్ సైకిళ్ళు స్వాదినం*

 

*అనుమానిత వ్యక్తులు మున్సిపల్ అధికారులని, ఇతర శాఖల అధికారులని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.*

 

*జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్ గారు….*

 

జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్., గారు గురువారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్టు కేసు వివరాలను వెల్లడించారు.

 

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ 20-12-2024 తేదీ ఉదయం 10.45 A.M. to 11.05 A.M గంటల సమయంలో D.No.19-12-120, 4th cross, కేశవయన గుంట, తిరుపతి వద్దకు ముగ్గురు వ్యక్తులు వెళ్ళి ఇంటి లో ఒంటరిగా ఉన్న మహిళతో తాము మున్సిపల్ ఆఫీసు నుండి వచ్చినామని, ఇంటిలో ఉన్న వాటర్ కనెక్షన్ లు మరియు డ్రైనేజ్ పైపుల కొలతలు వేయాలని ఆమెను నమ్మించినారు. ఆమె వారి మాటలు నమ్మి వారిని ఇంటి పక్కన, వెనుక ఉన్న డ్రైనేజ్ పైపుల వద్దకు తీసుకోని వెళ్ళగా, ముందుగా వేసుకున్న పధకము లో బాగముగా మరో ముద్దాయి ఆమె ఇంటిలోకి వెళ్ళి ఇంటి లో ఉన్న బీరువా, ఆలమర లలో ఉన్న బంగారు నగలు, డబ్బులు దొంగిలించుకుని రాగా తరువాత అందరూ అక్కడి నుండి పారిపోయినారు. అని తిరుపతి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసు స్టేషన్ నందు కేశవయన గుంట, తిరుపతి కు చెందిన శ్రీమతి పోలిన ధనమ్మ గారు ఫిర్యాదు చేయగా, తిరుపతి CCS పోలీస్ స్టేషన్ నందు Cr.No.62/2024 U/s 305(a), 319 (1) BNS క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనదని అన్నారు.

 

జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్ గారు ఆదేశాల మేరకు తిరుపతి CCS అడిషనల్ ఎస్పీ నాగభూషణం రావు గారి పర్యవేక్షణలో, తిరుపతి CCS డిఎస్పి శ్యామ్ సుందరం గారు మరియు ఇన్స్పెక్టర్లు జి.ప్రకాష్ కుమార్, చిన్న పెద్దయ్య, శివ కుమార్ రెడ్డి, SI ప్రదీప్ కుమార్ రెడ్డితో CCS సిబ్బంది బృందాలుగా ఏర్పడి, పాత నేరస్తుల గురించి విచారించి, వారి యొక్క కదలికల పైన నిఘా పెట్టి, ఈ దినం అనగా 06-02-2025 ఉదయం 09.30 గంటలకు తిరుపతి-చెర్లోపల్లి బై పాస్ రోడ్డు లో పై కనబరిచిన నేరాలు చేయడానికి అలవాటు పడిన అంతర్ రాష్ట్ర ముద్దాయిలను అదుపులోకి తీసుకొని, వారి నుండి సుమారు సుమారు 21 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణములు 280 గ్రాములు మరియు 08 లక్షల విలువైన ఒక కారు, రెండు మోటార్ సైకిల్ లను స్వాదినం చేసుకోవడం జరిగిందన్నారు.

 

ముద్దాయిలు కృష్ణ, అతని తమ్ముడు శరత్, వేణుగోపాల్ ఒక సభ్యులుగా ఉండి మరియు వారి సహచరులు రవి, గణేష్, ప్రశాంత్ లతో కలసి చెడు అలవాట్లుకు అలవాటు పడి, యుక్త వయసు నుండి దొంగతనలు చేయడం మొదలుపెట్టినారు. ఆ క్రమంలో వీరు బస్ లలో ప్రయాణించు ప్రయాణీకుల వద్ద బ్యాగు దొంగతనములు, జేబు దొంగతనములు, రాత్రివేళ ఇంటి దొంగతనములు, మోటార్ సైకిల్ దొంగతనములు చేస్తూ అలాగే మోసాలకు పాల్పడి, మున్సిపల్ అధికారులము అని చెప్పి, ఒక గ్రూప్ గా ఏర్పడి కాలనీలలో తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను గమనించి వారి ఇంటి వద్దకు వెళ్ళి, మేము మున్సిపల్ అదికారులము అని చెప్పి, ఇంటి లో వాటర్ పైపులు కొలతలు వేయాలి, అని వారిని నమ్మించి మోసం చేసి వారి ఇంటిలోకి వెళ్ళి ఇంటి లోని విలువైన బంగారు, నగదు దొంగిలిస్తారు, దొంగిలించిన సొత్తులతో విలాసవంతమైన జీవితము గడుపుతున్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కాగా కొన్ని కేసులలో జైలుకు కూడా వెళ్ళినారు. వీరిపై కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులు ఉన్నవి. ముద్దాయిలు దొంగతనములు చేయడానికి ఉదయం, మధ్యాహ్నం సమయంలో అనగా సుమారు 10.30 గంటల నుండి 03.30 గంటల మధ్యలో ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళలు ఎంచుకుని, వారితో తాము మున్సిపల్ ఆఫీసు నుండి వచ్చినాము అని నమ్మించి ఇంటిలోకి వెళ్ళి దొంగతనములు చేస్తారని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్ గారు తెలిపారు.

 

*కేసు నెంబర్* :- 62/2024 U/s 305(a), 319 (1) BNS of CCS, Tirupati.

*నేరము జరిగిన తేదీ*: 20-12-2024 at 10.45 A.M. to 11.05 A.M.

*నేరము జరిగిన ప్రదేశము*:- D.No.19-12-120, 4th cross, కేశవయన గుంట, తిరుపతి.

 

*అరెస్ట్ కాబడిన ముద్దాయిలు* :

 

A.1) A.కృష్ణ, వయస్సు 34 సం. లు, షిమోగా జిల్లా, కర్నాటక

A.2) A.శరత్, వయస్సు 24 సం. లు, షిమోగా జిల్లా, కర్నాటక.

A.3) H. వేణుగోపాల్ @ గోపి, వయస్సు 32 సం. లు, షిమోగా జిల్లా, కర్ణాటక.

 

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన తిరుపతి CCS ఇన్స్పెక్టర్లు జి.ప్రకాష్ కుమార్, చిన్న పెద్దయ్య, శివ కుమార్ రెడ్డి, ఎస్.ఐ ప్రదీప్ కుమార్ రెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది హెచ్.సి లు రవి ప్రకాష్, మురళి, మునిరాజులు, బసవరాజు రమేశ్, గోపికృష్ణ, వినాయక, పి.సి లు నాగరాజు శెట్టి, మోహన్, ప్రసాద్, హరిప్రసాద్ మరియు సైబర్ సెల్ సిబ్బంది రాజశేఖర్ లను జిల్లా ఎస్పీ గారు అభినందించి వారికి నగదు రివార్డ్ లు ఇవ్వడము జరిగింది.

 

Related posts

కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన…

Garuda Telugu News

విజయ్ సాయి రెడ్డిస్థానంలో ఫైర్ బ్రాండ్ కు బాధ్యతలు..!!

Garuda Telugu News

సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి సార్

Garuda Telugu News

Leave a Comment