
*అడవి జంతువులను
వేటాడే ఇరువురిని రిమాండ్ తరలించిన
బంగారుపాళ్యం సి ఐ
బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్ )ఫిబ్రవరి 6
బంగారుపాళ్యం మండలం అడవి జంతువులను
ఈ దినం అడవి జంతువులను వేటాడడం కోసం నాటు తుపాకీతో దొరికిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన బంగారు పాల్యం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు
వివరాలు నిన్నటి దినం అనగా 05.02. 2025 వ తేదీ 3PM గం. బంగారుపాలెం మండలం KM కండ్రిగ గ్రామ సమీపంలో K.గోపి వయస్సు 29 సంవత్సరాలు s/o G. ఉపేంద్రన్ ఇతని ఊరు విలుదోశ పాలెం పాల్యం. గుడియాత్తం తమిళనాడు రాష్ట్రం అలాగే L. ఆనంద వయస్సు 30 సంవత్సరాలు s/o లోకనాథ KM. కండ్రిగ విలేజ్ బంగారుపాలెం మండలం ఇరువురు అడవి పందులను మరియు ఇతర జంతువులను వేటాడడం కోసం కేఎం ఖండిక గ్రామ సమీపంలో నాటు తుపాకిని తీసుకు వెళుతూ ఉండగా సమాచారం తెలిసిన బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి పై తెలిపిన ఇరువురిని అరెస్టు చేసి ఈ దినం రిమాండ్ కు తరలించడం అయినది

