
*బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి12 వరకు పెంపు: కార్యనిర్వహణాధికారి బిసి కార్పొరేషన్ శ్రీదేవి*
తిరుపతి, ఫిబ్రవరి06: ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయడానికి, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 12 వ తేదీ వరకూ పెంచడం జరిగిందనీ, అర్హులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కొరకు దరఖాస్తులు ఈ నెల 12 లోపు అప్లై చేసుకోవాలని జిల్లా బీసీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి శ్రీదేవి ఒక ప్రకటనలో గురువారం సాయంత్రం వెల్లడించారు.

