
*ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం*
*నియోజకవర్గంలో ఎమ్మెల్యే, కలెక్టర్ సుడిగాలి పర్యటన*
*పిచ్చాటూరు, పాలమంగళం లలో సీసీ రోడ్లు ప్రారంభం*
*పిచ్చాటూరు అరణియార్ లో 14 లక్షల చేప పిల్లలు విడుదల*
*నాగలాపురం మండలం లో దుస్థితిలో ఉన్న రోడ్లు, వంతెనలు పరిశీలన*
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కలెక్టర్ వెంకటేశ్వర్లు సత్యవేడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.
బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు నియోజకవర్గ పర్యటనలో భాగంగా విచ్చేసిన కలెక్టర్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనం బైపాస్ వద్ద ఘనంగా స్వాగతిం పలికారు.
అక్కడ నుండి వారు పాలమంగళం కు చేరుకొని జడ్పీ హైస్కూల్ కు నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరం ఎస్టీ కాలనీ నుండి ఎస్.సి సంక్షేమ హాస్టల్ వరకు సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే, కలెక్టర్ భూమి పూజ చేసి, స్థానిక జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు.
అక్కడ నుండి పిచ్చాటూరు బైపాస్ కూడలి వద్ద చేరుకొని ఆరణియార్ పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలిస్తూ దాని పురోగతిని అక్కడేవున్న ఇరిగేషన్ ఈఈ మదన గోపాల్ ను అడిగి తెలుసుకున్నారు.
తదుపరి స్థానిక ఎస్సీ కాలనీకి నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం లో వారు పాల్గొని అనంతరం ఆరణియార్ గేట్ల వద్దకు చేరుకొని 14 లక్షల చేప పిల్లలను జలాశయంలో వదిలారు. పక్కనే ప్రైవేటు వ్యక్తులు పెంచుతున్న రంగు చేపలను సందర్శించారు. అనంతరం పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి ప్రజా ఆరోగ్యం పై వైద్యాధికారి హమీద్ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అర్ధాంతరంగా ఆగివున్న రూ.35 కోట్ల ఆరణియార్ ఆధునికీకరణ పనులను దళితగతిన పూర్తి చేయాలని స్థానిక రైతులు, ప్రజలు ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ కి విన్నవించారు.
నాగలాపురం మండలంలోని వర్షాలకు దెబ్బతిన్న ద్వారకా నగర్ కాజ్ వేను, టీపీ కోట రోడ్డు ను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుకొని, ఈ రోడ్డు, వంతెనను తరగతి గదిలో ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.
సురుటపల్లి లోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామి, అమ్మ వార్లను కలెక్టర్, ఎమ్మెల్యే దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ తిరుమాడ వీధుల్లో రథం ఊరేగింపు కోసం సిమెంటు రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు, భక్తులు విన్నవించగా, తప్పక నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
చివరిగా దాసుకుప్పం బైపాస్ రోడ్డు వద్దకు వారు చేరుకొని పరిశీలిస్తున్న సమయంలో ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో రూ.26 కోట్లు నిధులు కూడా మంజూరు అయిందని, ఈ రోడ్డు పూర్తి చేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు జరిగే మంచిది ఎమ్మెల్యే కలెక్టర్ వివరిస్తూ పనులు త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మూడు మండలాల్లో సాగిన కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటనలో ప్రతి చోట కలెక్టర్ కు ప్రజా సమస్యలను ఎమ్మెల్యే వివరిస్తూ.. అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల కలిగే లాభాలను పూసకొచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ప్రజలు, ఎమ్మెల్యే కోరిక మేరకు పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసే విధంగా తప్పక చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అప్పటికే చీకటి పడటంతో సత్యవేడు వరదయ్యపాలెం మండలాల పర్యటనలను రద్దు చేసుకొని కలెక్టర్, ఎమ్మెల్యే తిరుగు పయనమైయ్యారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
