Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలసిన జిల్లా కలెక్టర్ ఆనంద్

*మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలసిన జిల్లా కలెక్టర్ ఆనంద్*.

 

✍️ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి గారిని వారి నెల్లూరు నివాసంలో జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

 

⚡జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి కలెక్టర్ వివరించారు.

 

⚡రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి చెయ్యా లని కోరారు.

 

⚡జిల్లాలో పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు,పెండింగ్ పనులు ,అమలవుతున్న పథకాలు , సోమశిల ప్రాజెక్టు సంబధిత పనులు, ఆత్మకూరు నియోజక వర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలు చర్చించారు.ప్రధానంగా విద్యా రంగంలో రానున్న నూతన విధానాలపై చర్చించారు

 

* ఈ సందర్భంగా మంత్రి గారి నివాసం వద్ద సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి జిల్లా కలెక్టర్ గారిని శాలువాతో సన్మానించారు….తేది 5 ఫిబ్రవరి 2025

Related posts

కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు..

Garuda Telugu News

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు

Garuda Telugu News

గూడూరులో “గోవులు” మాయం

Garuda Telugu News

Leave a Comment