
*రామయ్య పట్నంలో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో ప్రశ్నించిన శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్*
4-2-2025 వ తేదీన రాజ్యసభలో రామపట్నంలో ఏర్పాటు చేసే బిపిసిఎల్ రిఫైనరీ మీద శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ ప్రశ్నించారు.
రసాయనాలు మరియు ఎరువుల శాఖ లో రాష్ట్రమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ సమాధానం ఇస్తూ:
_1) నెల్లూరు జిల్లా రామయపట్నం ఓడరేవులో 6000 ఎకరాల భూమిలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు కోసం బిపిసిఎల్ ప్రతిపాదనను అంగీకరించబడినది._
_2) శుద్ధి కర్మాగారం యొక్క కార్యాచరణ సామర్థ్యం సంవత్సరానికి 9-12 మిలియన్ మెట్రిక్ టన్నులు._
_3) ప్రాజెక్ట్ వ్యయం 96,862 కోట్ల రూపాయలు._
_4) ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది._
_5) ఇది 20 సంవత్సరాల కాలంలో చెల్లించాల్సిన ప్రోత్సాహకంగా 75% పెట్టుబడిని అందిస్తోందని_ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి అనుప్రియ పటేల్ తెలియజేశారు.
బీద మస్తాన్ రావు యాదవ్ గారి కార్యాలయము, నెల్లూరు
