Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త గా ఎయిర్ పోర్ట్ లు…. రూపు రేఖలు మారనున్న పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలు

*కేంద్రం కీలక ప్రకటన….. ఏపీలో కొత్త గా ఎయిర్ పోర్ట్ లు…. రూపు రేఖలు మారనున్న పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలు*

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎయిర్‌పోర్టులు

నాలుగు ఎయిర్‌పోర్టులపై ప్రీ ఫీజిబిలిటీ

మరో మూడు ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులపై ప్రీ ఫీజిబిలిటీ అధ్యయనం చేసినట్లు పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ తెలిపారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీదమస్తాన్‌రావు యాదవ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు శ్రీకాకుళం, పల్నాడు జిల్లా నాగార్జునసాగర్, ప్రకాశం జిల్లా ఒంగోలు, చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్‌పోర్టులపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రీ ఫీజిబిలిటీ అధ్యయనం చేశారన్నారు. కాకినాడ జిల్లా తుని-అన్నవరం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలను కూడా గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానికి అవసరమైన సాయం కోసం 1.5 మిలియన్‌ డాలర్ల గ్రాంటు ఇవ్వడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) డిసెంబరు 12న ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి తెలిపారు

టీడీపీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ఆ 1.5 మిలియన్‌ డాలర్ల నిధులు ఇంకా విడుదల కావాల్సి ఉందన్నారు. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూతో ఒప్పందం ప్రకారం ఆ సంస్థ 20 మిలియన్‌ యూరోల గ్రాంట్‌ ఇవ్వడానికి ఆమోదం తెలపగా..అందులో 5.57 మిలియన్‌ యూరోలను గత డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసినట్లు తెలిపారు. అంతేకాదు 2022 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు 141.4 మిలియన్‌ డాలర్ల రుణం అందించినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు గత జనవరి వరకు కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.43,472.06 కోట్లు విడుదల చేసినట్లు పంకజ్‌చౌధరి తెలిపారు.

Related posts

ఉపాధి హామీ గుంటలో ప్రమాద వశాత్తు పడి ఇంటర్ విద్యార్థిని మృతి.

Garuda Telugu News

సిఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

Garuda Telugu News

పిచ్చాటూరు తహసీల్దారు గా టీవీ సుబ్రమణ్యం భాద్యతలు

Garuda Telugu News

Leave a Comment