
అబిమానులు ఆత్మీయుల సంబరాల నడుమ కోలాహలంగా టీడీపి మండల అధ్యక్షుడు పి.యుగంధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం వేడుకలు
టీడిపి మండల అధ్యక్షుడు దివంగత మాజీ సమితి అధ్యక్షుడు కీ.శే.పి. శ్రీనివాసులు రెడ్డి గారి రాజకీయ వారసుడు పిన్నమరెడ్డి యుగంధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం వేడుకలు వారి స్వగృహంలో అబిమానులు ఆత్మీయులు కార్యకర్తల సంబరాల నడుమ కోలాహలంగా వేడుకగా జరిగింది.
ఈ సందర్భంగా కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు నాయకులు యుగంధర్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు కానుకలు ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మరింత ఉన్నత పదవులతో ప్రజాసేవకు అంకితం కావాలని కాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు వీరాభిమాని చెన్నవారిపాలెంకు చెందిన ఎన్టీఆర్ వెంకయ్య యుగంధర్ రెడ్డి జ్ఞాపకాల చిత్రాలతో గల ఫోటోను కానుకగా అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమంలో టిడిపి నేతలు పన్నెం నిర్మల్, కుమార్,సురేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రమణయ్య, కోటి (మేస్త్రి నాయకుడు), నందకిషోర్ రెడ్డి, బిజెపి అద్యక్షుడు దిలీప్ రాయల్, గుత్తి త్యాగరాజు, జనసేన అధ్యక్షుడు చిరంజీవి యాదవ్, మావుడూరు మోహన్
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సామర్ల హరి, పాత్రికేయులు కిన్నెర ఉమామహేష్, రమేష్, ప్రశాంత్, రాఘవ, అజిత్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
రాజ్ న్యూస్,కాతారి ప్రశాంత్
