
పుత్తూరు-ఊత్తుకోటై హైవేపై రోడ్డు ప్రమాదం…
నాగలాపురం: మండలంలోని బయటకొడియంబేడు గ్రామం వద్ద పుత్తూరు-ఊత్తుకోటై హైవేపై కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వివరాలు తమిళనాడుకు చెందిన వారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శణ అనంతరం చెన్నైకి తిరుగు ప్రయాణంలో వెళ్తూ బయటకొడియంబేడు గ్రామం వద్ద రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఆవును తప్పించబోయి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రాయిని డీకొనడంతో కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు తగలలేదని స్థానికులు తెలిపారు. పోలీసులు సఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
