Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం 

పత్రికా ప్రకటన

తిరుమల, 2025 ఫిబ్రవరి 02

 

టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం

 

టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ (ఎఫ్ఏసీ) శ్రీ కె.రామచంద్రమోహన్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

 

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ కె.రామచంద్రమోహన్ కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

———————————

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Related posts

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు

Garuda Telugu News

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం

Garuda Telugu News

అల్తూరుపాడు రిజర్వాయర్ పనులపై సీఎం గారి దృష్టికి ఎమ్మెల్సీ వినతి…

Garuda Telugu News

Leave a Comment