
*ప్రజల నుండి వచ్చే వినతులు త్వరితగతిన పరిష్కరించండి.*
*కమిషనర్ ఎన్.మౌర్య*
ప్రజల నుండి వచ్చే వినతులు సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 10 మంది, మరో 40 మంది వినతులు ద్వారా సమస్యలను విన్నవించారని కమిషనర్ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఆకుతోట వీధిలో మురుగు కాలువలు శుభ్రం చేయాలని, టి.డి.ఆర్. బాండ్లు ఇప్పించాలని, కోటకొమ్మల వీధిలో సెట్ బాక్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, ఉపాద్యాయ నగర్ లో కుక్కల సమస్య పరిష్కరించాలని, భవాని నగర్ లో యుడిఎస్ సమస్య పరిష్కరించాలని, సాయి విష్ణు లే ఔట్ నందు కాలువలు నిర్మించాలని, రవీంద్ర నగర్ నందు రోడ్లు, మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని ప్రజలు వినతులు సమర్పించారని తెలిపారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డి.ఈ. లు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.
