
కాణిపాకం మాస్టర్ ప్లాన్ ని పరిశీలించిన రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు
కాణిపాకం జనవరి 20 (గరుడ దాత్రి) కాణిపాకం దేవస్థానం అభివృద్ధి పనులపై మాస్టర్ ప్లాన్ గురించి సోమవారం రాష్ట్ర దేవాలయ శాఖ సీ.ఈ శేఖర్ దేవదాయ శాఖ స్థపతి పరమేశ్వరప్ప లు దేవస్థానం నందు జరుగు అభివృద్ధి కార్యక్రమాలపై దేవస్థానం నందు జరుగుతున్న నిర్మాణ పనులను నూతన అన్నదానం, వినాయక సదన్,తదితర ప్రాంతాలను పరిశీలించారు, మాస్టర్ ప్లాన్ కోనేరు మార్పిడి పై సాధ్యసాధ్యులను పరిశీలించారు,ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ ఈ.ఈ వెంకటనారాయణ, దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయ ఈ.ఈ గంగయ్య, భవిరి రవి, ఏఈఓ రవీంద్రబాబు, దేవస్థానం మాజీ చైర్మన్ నాయుడు, ఏ.ఈలు, తదితరులు పాల్గొన్నారు.
