
*తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు*
ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యితో పాటు నిత్యావసర సరకుల్లో కల్తీని గుర్తించేందుకు గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) పంపిన అత్యాధునిక ల్యాబ్ పరికరాలు తిరుమల చేరుకున్నాయి. టీటీడీకు గ్యాస్ క్రోమటోగ్రఫీ, హై పెర్ఫామెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే రెండు పరికరాలు అందజేసింది. వాటిద్వారా నెయ్యితోపాటు నిత్యావసర సరకుల నాణ్యత ఎఫ్ఎస్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం ఉందోలేదో పరిశీలించవచ్చు.
