
: మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ల అంశం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశం కూటమిలో దుమారానికి దారితీసింది. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే అంశంపై ఎవరూ మాట్లాడొద్దని టీడీపీ నేతలకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.*
*లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పింది.*
