Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కాపునాడు సేవాసమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పెమ్మా మల్లికార్జున

కాపునాడు సేవాసమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పెమ్మా మల్లికార్జున

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పెమ్మా మల్లికార్జున ను ( సీనియర్ పాత్రికేయులు) నియమించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు తెలియజేసారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు గారు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు లు పెమ్మా మల్లికార్జున కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభివృద్ది సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన సంస్థ కాపునాడు సేవా సమితి అన్నారు. చిత్తూరు తిరుపతి జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి కార్యక్రమాలు చేపట్టి కాపులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా సీనియర్ పాత్రికేయులు పెమ్మా మల్లికార్జున ను నియమించినట్లు తెలిపారు. కాపులు విద్యా ఉద్యోగ పరంగా ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా ఎదగాలన్నదే కాపునాడు సేవా సమితి ఆశయమన్నారు. కాపుల అభివృద్ది కోసం పనిచేస్తూ కాపుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చేస్తున్న సంస్థ కాపునాడు సేవా సమితి అన్నారు. అనుభవజ్ఞులు సీనియర్ పాత్రికేయులు పెమ్మా మల్లికార్జున ఆద్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లాలలో కాపునాడు సేవా సమితి కార్యక్రమాలు విస్తృతం చేయడం జరుగుతుందని జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పెమ్మా మల్లికార్జున ను పలువురు కాపు నాయకులు మిత్రులు ఘనంగా సన్మాించారు అభినందించారు. తిరుపతి జిల్లా కన్వీనర్ సి మల్లికార్జున, జిల్లా అడ్వై జర్ సాయి రాయల్ కోకన్వినర్ రమేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన చంద్ర, వైస్ ప్రెసిడెంట్ వి.వి. సాంప్రసాద్ మెంబర్ సతీష్ బాబు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపునాయకులు పాల్గొన్నారు.

 

Related posts

శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రజలందరినీ చల్లగా చూడాలి

Garuda Telugu News

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

Garuda Telugu News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం ‘స్టాగ్ బీటల్’, దీని ధర రూ.75 లక్షలు

Garuda Telugu News

Leave a Comment