Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఈ ప్రభుత్వం రెండు నెలల్లో లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చని, ఆ తర్వాత మీ కథ ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు

వైయస్సార్ జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బెదిరింపులకు దిగారు. ఈ ప్రభుత్వం రెండు నెలల్లో లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చని, ఆ తర్వాత మీ కథ ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు.*

*జగన్ సమీప బంధువు, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్కు చేరుకున్నారు. ఈ సమయంలో వివిధ విచారణల్లో భాగంగా డీఎస్పీ దూకుడుగా ప్రదర్శిస్తున్నాడంటూ ఆయనపై జగన్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించారు. ఈ సమయంలో హెలిప్యాడ్ వద్ద ఆగిన జగన్, డీఎస్పీని తన వద్దకు పిలిపించుకున్నారు.*

*మౌనంగా విని అక్కడి నుంచి వెళ్లిపోయిన డీఎస్పీ: బందోబస్తు విధుల్లో దూరంగా ఉన్న డీఎస్పీ వెంటనే తనతో పాటు మరో ఇద్దరు సీఐలను వెంటబెట్టుకుని జగన్ వద్దకు వెళ్లారు. డీఎస్పీని ఉద్దేశించి జగన్ తీవ్ర స్వరంతో ఆవేశంతో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండమంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఈ సమయంలో డీఎస్పీ మౌనంగా వింటూ వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టుల కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులో రిమాండ్ ఖైదీ వర్రా రవీందర్రెడ్డి పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.*

*రెండు రోజుల కస్టడీలో వర్రాను ఇటీవల సమగ్రంగా విచారించారు. అదే విధంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై వర్రా ఇచ్చిన వాంగ్మూలం మేరకు 41ఏ నోటీసు ఇచ్చి ఆయన్ను పలుమార్లు విచారించారు. మాజీ మంత్రి వివేకా పీఏ కృష్ణారెడ్డి ప్రైవేటు కేసు నేపథ్యంలో పలువురిని విచారిస్తున్నారు. వీటన్నింటినీ డీఎస్పీనే స్వయంగా విచారిస్తూ వ్యవహారాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల రోజులుగా వరుస పరిణామాలతో పలువురుని విచారించారు. కేసుల వ్యవహారాలను బట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ తన బాధ్యతలను నిర్వహిస్తుండగా మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి అందరి ముందు బెదిరింపులకు దిగడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.*

Related posts

తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకోనున్న పిచ్చాటూరు మండల విద్యాశాఖధికారిణి కె హేమమాలిని

Garuda Telugu News

గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు నియోజకవర్గంలో పర్యటన

Garuda Telugu News

పార్టీ అధిష్టాన నిర్ణయమే అందరికీ శిరోదార్యం

Garuda Telugu News

Leave a Comment