
నారాయణవనం మండలం సముదాయం గ్రామ ప్రాథమిక పాఠశాల, ఎస్ టి కాలనీ వెనుక భాగంలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు. అధికారుల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నాయని ప్రజలు లో విమర్శలు ఉన్న, ఇసుక అక్రమంగా తరలించేయడంతో పాఠశాల వెనుక భాగం లో ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకొరకడానికి సిద్ధంగా ఉన్నాయి.విద్యుత్ స్తంభాలు నేలకూలితే విద్యుత్ సబ్ స్టేషన్ కు వస్తున్న విద్యుత్తుకు అంతరాయం కలుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎస్టీ కాలనీ వాసులు నివసిస్తున్న ఇండ్ల పక్కనే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎస్టి కాలనీవాసులు వాపోతున్న పట్టించుకునే నాధుడే లేడు..? ఇసుక మాఫియా దౌర్జన్యాలకు ఎస్టీ కాలనీవాసులు రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.రైతులు , ఎస్టీ కాలనీవాసులు ఇసుక అక్రమ రవాణా దారుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాస్థాయి రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే….?
