
ఆరూరులో మినీగోకులం షెడ్డుకు ప్రారంభోత్సవం
… సత్యవేడు మండలం ఆరూరు గ్రామంలో మినీగోకులం షెడ్డుకు టిడిపి మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.ఆదివారం ఆరూరులో మహిళా రైతు విజయమ్మ నిర్మించిన మినీగోకులం షెడ్డును ఆయన ఉపాధిహామీ అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మినీగోకుల నిర్మాణాలకు నిధులను మంజూరు చేసిందన్నారు.జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతోనే రైతులు మినీ గోకుల షెడ్లను నిర్మించడం జరిగిందన్నారు.తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు పాడి రైతులు ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు ఉందన్నారు.కాగా మండలంలో 51 మినీ గోకుల షెడ్లు మంజూరు కాగా ఇప్పటికే 50 మినీ గోకులాల నిర్మాణాలు పూర్తయినట్టు ఉపాధి హామీ అధికారులు పేర్కొన్నారు
ఈ నేపథ్యంలో నాలుగు పశువులకు సంబంధించిన మినీ గోకుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకంలో రెండులక్షల 30 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ క్రమంలో మకరసంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తయిన మినీగోకుల షెడ్లను జనవరి 10,11,12 తేదీలలో మూడు రోజులు పాటు ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ అధికారులు లోకమ్మ,సుమలత,మనోహర్ పలువురు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
