
టిడిపి నేత కుమార్ పెద్దమ్మ భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి
నాగలాపురం కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం.డీ కుమార్ పెద్దమ్మ భౌతికకాయానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నివాళులు అర్పించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం.డీ కుమార్ పెద్దమ్మ మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం నాగలాపురం చేరుకొని మృతురాలికి శ్రద్దాంజలి ఘటించారు.
అనంతరం ఎండీ కుమార్, అతని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
