
సీఎం చంద్రన్నకు ఎమ్మెల్యే ఆదిమూలం ఘన స్వాగతం
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు ఘన స్వాగతం పలికారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా నారావారి పల్లె కు విచ్చేయడంలో భాగంగా ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు
అప్పటికే రేణిగుంట విమానాశ్రయం వద్ద వేచి ఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
