
పాకాల ఎస్.ఐగా బాధ్యతలు చేపట్టిన యం.ఎన్.సంజీవరాయుడు…..
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో పాకాల ఎస్.ఐగా యం.ఎన్.సంజీవరాయుడు మంగళవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పాకాల ఎస్.ఐ సంజీవరాయుడు మాట్లాడుతూ తిరుపతి ఎస్పీ ఆఫీస్ వి.ఆర్ నుంచి పాకాల ఎస్.ఐగా మంగళవారం బాధ్యతలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.చట్టం దృష్టిలో అందరూ సమానులేనని,ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
