
నూతన సంవత్సరం వేడుకల పేరుతో మద్యం తాగి అల్లర్లు చేస్తే జైలుకే పరిమితం… ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్
ఎస్ఆర్ పురం న్యూస్..నూతన సంవత్సరం వేడుకల పేరుతో డిజె సౌండ్లు మద్యం తాగి అల్లర్లు చేస్తే జైలుకే పరిమితం అవుతారని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ తెలిపారు.. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవంతో జరుపుకోవాలని సంబరాలు పేరుతో హద్దులు మీరితే సహించే ప్రసక్తే లేదని ఎస్ఐ సుమన్ తెలిపారు అలాగే ఈ నూతన సంవత్సర వేడుకల్లో చిన్న పిల్లల వద్ద ద్విచక్ర వాహనాలు ఇచ్చినడిపితే తల్లిదండ్రులకు పై కేసు నమోదు చేస్తాం.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ బైక్ త్రిబుల్ రైడింగ్ లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుమన్ తెలిపారు..
