
సత్యవేడును ప్రగతి వైపు నడిపిద్దాం
నూతన సంవత్సరంలో సత్యవేడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి టిడిపి శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి క్రియాశీలక నేత గంగా ప్రసాద్ కోరారు మంగళవారం సూళ్లూరుపేటలో గంగా ప్రసాద్ ఇంటి వద్ద ముందస్తు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 2025 సంవత్సరంలో విభేదాలకు దూరంగా, ఐక్యమత్యంగా టిడిపి లోని అందరూ అభివృద్ధి పదం వైపు అడుగులు వేయాలని గంగ ప్రసాద్ కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి దూసుకుపోతున్నారని చెప్పారు అదేవిధంగా గ్రామ, పంచాయితీ, మండల స్థాయి నాయకులు ఆయా ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల టిడిపి నాయకులు ఇటు గంగా ప్రసాద్ కు, అటు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు పూలమాలలు, బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరంలో అయినా క్రియాశీలక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్ర పార్టీ అధిష్టానం చొరవ చూపే విధంగా గంగ ప్రసాద్ అడుగులు వేయాలని టిడిపి శ్రేణులు ముక్తకంఠంతో అభ్యర్థించారు
