
*టీడీపీ సభ్యత్వ నమోదులో చరిత్ర సృష్టించిన మంగళగిరి*
*మంగళగిరిలో లక్ష మార్క్ దాటిన సభ్యత్వ నమోదు*
*నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్*
*శాశ్వత సభ్యత్వాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన మంగళగిరి*
*స్వచ్చందంగా ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్న మంగళగిరి ప్రజలు*
*సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు అభినందనలు తెలిపిన నాయకులు*
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చరిత్ర సృష్టించింది. సభ్యత్వ నమోదులో లక్ష దాటించి గుంటూరు పార్లమెంట్లో మొదటి స్థానంలో నిలిచింది. మంగళగిరి నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. అలాగే శాశ్వత సభ్యత్వాలలో మంగళగిరి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 80 మంది నాయకులు రూ.1,00,000 చెల్లించి శాశ్వత సభ్యత్వాలు తీసుకున్నారు.
