
*హద్దులు మీరితే సహించేది లేదు….. ఎస్ఐ సునీల్*
🚨 ప్రంశాంత వారావరణం లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవా లని, సంబరాలు పేరుతో హద్దు మీరితే సహించే ప్రశక్తి లేదని ఎస్ఐ సునీల్ స్పష్టం చేశారు.
🚨ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అచాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు వెల్లడించారు.
🚨నూతన సంవత్సరంను పురస్కరించుకుని యువకులు ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా నిలబడి కేకులు కత్తరించడం లాంటివి చేయకూడద న్నారు.
🚨31 రాత్రి 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మధ్యం తాగుతూ బైకులో త్రిబుల్ రైడింగ్ నడుపుతూ పట్టుబడితే మాత్రం జైలు శిక్ష తప్పదన్నారు. నూతన సంవత్సర వేడుకను కుటుంభ సభ్యులు, బందు మిత్రులతో ఆహ్లాదకరంగా జరుపుకోవాలన్నారు.
