
*సత్యవేడు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి సార్..*
*జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్ కు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వినతి*
వర్షానికి దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు పునర్ నిర్మించాలని విజ్ఞప్తి*
*పిచ్చాటూరు బీసీ బాలికల హాస్టల్ కు రోడ్డు, దుప్పట్లు పంపిణీకి హామీ*
*కలెక్టర్, జేసీ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే*
సత్యవేడు గరుడ దాత్రి న్యూస్ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్ ను కోరారు.
సోమవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఈ మేరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాజాగా కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని వంతెనలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని కలెక్టర్ కు వివరించారు.
అలాగే పిచ్చాటూరు ప్రభుత్వ సంక్షేమ బీసీ బాలికల హాస్టల్ భవనం, రోడ్డు దుస్థితి తో పాటు విద్యార్థులకు దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ గురించి కలెక్టర్ కు క్షుణ్ణంగా తెలిపారు.
సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రోడ్లు, వంతెనలు మరమ్మత్తు పనులకు నిధులు మంజూరుకు కృషి చేస్తానని తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
అలాగే బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీకి కలెక్టర్ ఒకే చెప్పినట్లు, హాస్టల్ భవనం, రోడ్డుకు ప్రతిపాదన పంపితే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ చెప్పినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ సమిత్ కుమార్ ను ఎమ్మెల్యే కలిసి సమస్యలను వివరించారు.
చివరగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు ఎమ్మెల్యే శాలువా కప్పి నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలను తెలిపారు.
