Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక – 2024


తిరుపతి జిల్లా..

 

*తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక – 2024*

మన తిరుపతి జిల్లా ప్రపంచ ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వెలసిన దివ్య క్షేత్రం, జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తి తో పాటు తిరుచానూరు, నారాయణవనం, నాగలాపురం, శ్రీనివాస మంగాపురం లాంటి పుణ్య క్షేత్రాలు తిరుపతి జిల్లాలో వెలసి ఉన్నాయి. మన దేశానికే తలమాణీకమైన శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ కేంద్రం, శ్రీ సిటీ సెజ్, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం లతో కూడి వున్నది. అలాగే 5 విశ్వ విద్యాలయాలు, అనేక కళాశాలతో కూడి ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా బాసిల్లుతున్నది. అంతే కాకుండా తిరుపతిలో స్విమ్స్, రుయా, బర్డ్ హాస్పిటల్, అనేక కార్పొరేట్ హాస్పిటళ్ళు ఉన్నందున జిల్లా వాసులే కాక ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతిరోజూ వేలాది మంది వైద్య సదుపాయం కోసం వచ్చి వెళుతుంటారు, వీరందరిని దృష్టిలో పెట్టుకొని జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం విధి నిర్వహణలో జిల్లా పోలీసులు దీక్షతో విధులు నిర్వహిస్తున్నామని సోమవారం నాడు శ్రీ పద్మావతి సావేరి కాన్ఫరెన్స్ హాల్ నందు వార్షిక నేరాల గణాంకాలపై ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహించి జిల్లా ఎస్పీ శ్రీ యల్.సుబ్బరాయుడు, ఐ.పి.యస్ గారు వివరాలను వెల్లడించారు.

 

*తిరుపతి జిల్లా వార్షిక నేరాల వివరాలు…*

 

*పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో – నేర నియంత్రణ చర్యలు:*-

 

❇️ *దేహ సంబంధిత నేరాల (Bodily offences) లో 2023 లో 933 నేరాలు జరగగా 2024 లో 921 నేరాలు జరిగినాయి.*

 

❇️ *ఆస్తి సంబంధిత నేరాల (Property offences) లో 2023 లో 993 నేరాలు జరగగా 2024 లో 983 నేరాలు జరిగినాయి.*

 

❇️ *రోడ్డు ప్రమాదాల (Road Accidents) లో 2023 లో 1039 ప్రమాదాలు జరగగా 2024 లో 1015 ప్రమాదాలు జరిగినాయి.*

 

❇️ *సైబర్ నేరాల (Cyber Crime) లో 2023 లో 173 నేరాలు జరగగా 2024 లో 248 నేరాలు జరిగినాయి.*

 

❇️ *వైట్ కాలర్ నేరాలు (White Collar Crime) లో 2023 లో 336 నేరాలు జరగగా 2024 లో 312 నేరాలు జరిగినాయి.*

 

❇️ *ఇతర IPC నేరాలు (Other IPC) లో 2023 లో 2651 నేరాలు జరగగా 2024 లో 2217 నేరాలు జరిగినాయి.*

 

*మొత్తంగా గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం 7% శాతం మేరకు కేసులు తగ్గినాయి. సైబర్ క్రైమ్ నేరాలు నమోదు పెరిగాయి.*

 

*సైబర్ క్రైమ్:*-

 

➡️ 2023 NCRP (without FIR, FIR, Court order) ల ద్వారా నమోదైన సైబర్ కేసులలో ఇప్పటివరకు రూ.2,44,60,014/- ల నగదును సైబర్ నెరగాళ్లు దోచుకోగా రూ.84,08,392/- ల నగదును రికవరీ చేసి నేరుగా భాధితులకు రిఫండ్ చేయించడం జరిగింది.

 

➡️ 2024 NCRP (without FIR, FIR, Court order) ల ద్వారా నమోదైన సైబర్ కేసులలో ఇప్పటివరకు రూ.12,89,28,136/- ల నగదును సైబర్ నెరగాళ్లు దోచుకోగా రూ.2,36,16,426/- ల నగదును రికవరీ చేసి నేరుగా భాధితులకు రిఫండ్ చేయించడం జరిగింది.

 

➡️ ఈ MOBILEHUNTఅప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులలో ఇప్పటి వరకు రూ.7,56,40,000/- విలువ గల 4275 మొబైల్లను రికవరీ చేసి భాధితులకు అందజేశాము.

 

*Best conviction in murders and POCSO cases – 2024:*-

 

• తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no. 32/2022) లో నేరం నిరూపణ అయ్యి ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.1,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• యస్.వి.యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no. 68/2014), (Cr.no. 168/2022) లో నేరం నిరూపణ అయ్యి 02 ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.2,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no. 685/2021) లో నేరం నిరూపణ అయ్యి ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.1,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు ( Cr.no. 272/2022 ) లో నేరం నిరూపణ అయ్యి ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కారాగార శిక్ష తో పాటు రూ.1,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు ( Cr.no.280/2022) లో నేరం నిరూపణ అయ్యి ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కారాగార శిక్ష తో పాటు రూ.5,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no.348/2018), (Cr.no. 259/2018) లో నేరం నిరూపణ అయ్యి 02 ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కారాగార శిక్ష తో పాటు రూ.1,500/- జరిమానా విధించడం జరిగినది.

 

• చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no. 140/2021), లో నేరం నిరూపణ అయ్యి ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కారాగార శిక్ష తో పాటు రూ.5,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no. 17/2022) లో నేరం నిరూపణ అయ్యి ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.1,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• కే.వి.బి పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no. 08/2019) లో నేరం నిరూపణ అయ్యి ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.10,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక POCSO కేసు (Cr.no. 62/2021) లో నేరస్తునికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.20,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక POCSO కేసు (Cr.No. 232/2020) లో నేరస్తులకి 05 సం.లు కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.20,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• బాలయ్యపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక POCSO కేసు (Cr.No. 55/2015) లో నేరస్తులకి 10 సం.లు కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.22,000/- జరిమానా విధించడం జరిగినది.

 

• సుళ్ళురుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక POCSO కేసు (Cr.No. 171/2014) లో నేరస్తునికి 10 సం.లు కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.20,000/- జరిమానా విధించడం జరిగినది.

 

*మాదకద్రవ్యాలు నివారణ చర్యలు (Ganja Task Force):*-

 

🔰 గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి Addl.SP (L&O), 1 CI, 1 HC మరియు 16 PCలతో GANJA టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది.

 

🔰 85 గంజాయి (NDPS) కేసులు నమోదు చేయబడ్డాయి, 872.307 కిలోల గంజాయి మరియు 17 వాహనాలను స్వాధీనం చేసుకుని, 223 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

 

🔰 అలవాటు పడిన 239 మంది నేరస్తులపై గంజా షీట్స్ ను ఓపెన్ చేయడం జరిగింది.

 

🔰 విద్యాసంస్థలలో 241 డ్రగ్స్ దుర్వినియోగ నిరోధక కమిటీలు (DAPC) ఏర్పాటు చేయడం జరిగింది.

 

🔰 92 గంజాయి వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము.

 

🔰 నిరంతరం గంజాయి టాస్క్ ఫోర్స్ రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు మరియు ఇతర గంజాయి హాట్‌ స్పాట్‌లలో తనిఖీలు నిర్వహిస్తోంది.

 

🔰 జిల్లా వ్యాప్తంగా జనసంచారం ఉన్న ప్రాంతాలు, విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్ళ వద్ద మాదకద్రవ్యాల దుర్వినియోగంపై, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, ట్రాఫిక్ రూల్స్ & హెల్మెట్ ధరించుట పై అవగాహనా కల్పిస్తూ పోస్టర్లు, హోర్డింగ్లను ఏర్పాటు చేసి విరివిగా ప్రచారం చేయడం జరిగింది.

 

🔰 జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు, పాటశాల విద్యార్ధిని, విద్యార్ధులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము.

 

*జిల్లా పోలీసులు టెక్నాలజీ ని ఉపయోగించి చేధించిన సంచలనాత్మక కేసుల వివరాలు:*-

 

✅ వాకాడు పోలీస్ స్టేషన్ పరిధిలో (Cr.No. 89/2024) ఒక హత్య కేసుకు సంబందించి 5 గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.

 

✅ యస్.వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో (Cr.No. 112/2024) తిరుపతి రాయల్ నగర్ నందు జయలక్ష్మి 70 సం”లు వయసుగల వృద్దురాలు హత్యా కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.

 

✅ భాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్దుడిని కిడ్నాప్ చేసిన కేసులు 04 ముద్దాయిలను అరెస్ట్ చేసి, వారి దగ్గర నుండి డమ్మి పిస్టల్, కారు, మత్తు ఇంజక్షన్, ఆటోను రికవరీ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.

 

✅ నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో (Cr.No.246/2024) ఇనుప లోడ్ లారీని సుమారు రూ.50,00,000/- కేసు లో 03 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, చోరి సొత్తును రికవరీ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.

 

✅ చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో (Cr.No. 218/2024) ATM దొంగతనం కేసుకు సంబందించి ముద్దాయిని అరెస్ట్ చేసి వారి నుండి రూ.5,38,000/-, ఒక మారుతీ ఆల్టో కారు, LG రీ ఫ్రిడ్జ్ రేటర్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక యమహా ప్యాసినో స్కూటీ (విలువ సుమారు రూ.11,97,000/) రికవరీ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.

 

*స్వాదీనం చేసుకున్న అక్రమ మద్యం ద్వంసం:*-

 

*️⃣ జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణాలో పట్టుపడిన 36 లక్షల విలువైన మద్యం బాటిళ్లను వివిధ సైజుల్లో (క్వార్టర్, హాఫ్, ఫుల్) మొత్తం 27,568 మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ సాయంతో ద్వంసం చేసారు.

 

*అవగాహన కార్యక్రమాలు (సైబర్ క్రైమ్, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, యాంటి ర్యాగ్గింగ్):*-

 

#️⃣ సైబర్ క్రైమ్ వారోత్సవాలు 9 రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించి గ్రామ స్థాయి నుండి విద్యా సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల యందు సైబర్ నేరాల పై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరచడం జరిగింది. ఈ వారోత్సవాలలో ఒకే రోజున 60 వేల మంది విద్యార్ధిని, విద్యార్ధులకు ZOOM Meeting ద్వారా ఏ.పి డి.జి.పి గారి ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది.

 

#️⃣ జిల్లా వ్యాప్తంగా మహిళా రక్షక్ సిబ్బంది, మహిళా సంభందిత నేరాలపై 117 అవగాహనా సదస్సును పాటశాలలు, హాస్టల్, కాలేజీ లలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 

#️⃣ మహిళలపై అఘాయిత్యాలను నివారించాలనే ఉద్దేశ్యంతో మహిళా పోలీసులను 2 పెట్రోలింగ్ విభాగాలుగా విభజించి పాఠశాల పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి వివరిస్తూ మరియు సైబర్ నేరాలు, కాల్ మనీ వంటి నేరాలపై మహిళలకు అవగాహన కల్పిస్తూ, అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో 24/7 గస్తి కాస్తూ, అవసరమైన చోట కౌన్సెలింగ్ చేస్తూ మహిళలకు రక్షణగా నిలుస్తున్నారు.

 

#️⃣ మహిళా రక్షణ SOS కాల్స్ ను 03 – 04 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకోగలుగుతున్నారు.

 

#️⃣ యాంటి ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయాల యందు పోలీస్ వారు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

 

*ట్రాఫిక్ నిర్వహణ మరియు రోడ్డు ప్రమాదాలు:*-

 

⏺️ హైవే మొబైల్‌లు : హైవే రోడ్డు లలో నో పార్కింగ్‌ ప్రాంతాలలో వాహనాలు నిలపకుండా, హైవే రోడ్డు లేన్‌లను క్లియర్‌గా ఉంచడానికి, ట్రాఫిక్ సాఫీగా సాగడానికి సిబ్బందిని ఏర్పాటు చేసాము.

 

⏺️ బ్రీత్ ఎనలైజర్లు : తాగి వాహనాలు నడిపే వారిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా గుర్తించి కేసులను బుక్ చేయడం.

 

⏺️ కమాండ్ కంట్రోల్ సెంటర్ : ట్రాఫిక్ రద్దీని నిర్యంత్రించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నాము.

 

⏺️ ప్రమాదాలు జరుగు ప్రదేశం (బ్లాక్ స్పాట్) : నేషనల్ హైవే నందు ఎక్కువ ప్రమాదాలు జరుగు 100 బ్లాక్ స్పాట్ లను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించాము. NH అధికారులు, రెవెన్యూ, RTA & పోలీస్‌లతో సమావేశం నిర్వహించి బ్లాక్ స్పాట్‌ల వద్ద రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలను తీసుకున్నాము. అవసరమైన చోట బ్యారికెట్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారిస్తున్నాము.

 

⏺️ హెల్మెట్ అవగాహన: తిరుపతి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలలో ట్రాఫిక్ నియమాలు మరియు హెల్మెట్ వినియోగం పై అవగాహన కార్యక్రమాలు మరియు హెల్మెట్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది.

 

⏺️ శ్యబ్ద కాలుష్యం: తిరుపతి నగరం నందు 385 బుల్లెట్ వాహనాలకు సంబంధించిన సైలెన్సర్ లను రోడ్ రోలర్ సహాయంతో నుజ్జు నుజ్జు చేశారు.

 

*పబ్లిక్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమం (CCTV కెమెరాలు ఏర్పాటు):*-

 

▶️ శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజల భద్రత కోసం తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలు వ్యాపార సంస్థలు, పరిస్త్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించి సి.సి కెమెరాల వినియోగం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాము.

 

▶️ వాణిజ్య సముదాయాలు వున్న ప్రతిచోటా స్వచ్చంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.

 

*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS):*-

 

🔸 PGRS లో వచ్చు ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తూ బాధితులకు తగిన న్యాయం చేస్తున్నాము. అలాగే ప్రజల సౌలభ్యం కోసం ఆన్లైన్ పోలీస్ సేవలను మరింత బలోపేతం చేసి సకాలంలో వారికి సేవలను అందిస్తున్నాము.

 

🔸 ఇప్పటి వరకు PGRS ద్వారా 882 ఫిర్యాదులు రాగా అందులో 762 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది, 120 కూడా నిర్ణీత గడువు సమయంలో విచారించడం జరుగుతుంది.

 

*పోలీస్ వెబ్ సైట్ ప్రారంభం:*-

 

🔹 తిరుపతి జిల్లా ప్రజల సౌకర్యార్థం పోలీసు శాఖ వెబ్‌సైట్ సేవలను ప్రారంభించింది.

 

🔹 ప్రజలకు అవసరమైన పోలీసు సేవలు మరియు సమాచారాన్ని https://Tirupatipolice.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

 

🔹 పారదర్శకత, జవాబుదారీతనం మరియు పౌర-స్నేహపూర్వక పోలీసింగ్‌.

బందోబస్తు విధులు: VVIP ల పర్యటన మరియు ఉత్సవాలకు పటిష్టమైన భద్రత:-

 

🔹 భారత ఉప రాష్ట్రపతి, భారత ప్రధాన మంత్రి, మాజీ ఉప రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయ మూర్తి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులకు తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత కల్పించడం జరిగింది.

 

🔹 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలు, వైభవంగా జరిగింది ఈ బ్రహ్మోత్సవాలలో ఎక్కడ కూడా భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా ఆటంకం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసాము చిన్నపిల్లలు వృద్ధులు తప్పిపోకుండా జియో ట్యాగ్లను కట్టి తప్పిపోయిన పిల్లలు వృద్దులను సకాలంలో గుర్తించి వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది.

 

🔹 స్థానిక ఉత్సవాలైన తిరుపతి గంగమ్మ జాతర, సూళ్ళూరుపేట చెంగాలమ్మ జాతర, వెంకటగిరి పోలేరమ్మ జాతర ఇలా ఎన్నో ఉత్సవాలు, పండగలకు ప్రజల/భక్తుల మనోభావాలను గౌరవించి భద్రతను కల్పించడంలో గట్టి చర్యలు తీసుకున్నాము.

 

*సిబ్బంది సంక్షేమం:*-

 

⏭️ పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి, కాన్సర్ పై అవాగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాము. అలాగే బ్లడ్ క్యాంపులను నిర్వహించి, సేకరించిన బ్లడ్ లను ఆపదలో ఉన్న నిస్సహాయులకు గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నాము.

 

⏭️ అంతేకాకుండా ఇటీవల కాలంలో అకాల మరణం చెందిన పోలీస్ కుటుంబకు మేమున్నామని భరోసా కల్పిస్తూ కారుణ్య నియమకాలు కూడా సకాలంలో ఇస్తున్నాము.

 

ఈ విధంగా తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు నిరంతరం ప్రజలలో ఉండి, శాంతి భద్రతలను అదుపు చేస్తూ ప్రజలకు అన్ని వేళలా మేము ఉన్నామనే నినాదంతో అండగా సేవలు చేస్తున్నారు. ఇదే స్పూర్తితో రాన్నున్న రోజులలో కూడా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అన్నారు.

 

ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ శ్రీనివాస్ గారు, అధనపు ఎస్పీలు శ్రీ వెంకట్రావు పరిపాలన, శ్రీ రవిమనోహరాచారి శాంతి భద్రత, శ్రీ నాగభూషణం నేర విభాగం, శ్రీ రామకృష్ణ తిరుమల, ట్రైనీ ఐ.పి.యస్ బి.హేమంత్, డి.యస్.పి లు గిరిదర ఎస్.బి, వెంకట నారాయణ తిరుపతి, సి.ఐ లు శ్రీనివాసులు ఎస్.బి, రామయ్య యస్.వి.యు, ఆర్.ఐ వెల్ఫర్ రమణా రెడ్డి మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Related posts

ఆదర్శప్రాయులు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేత్కర్

Garuda Telugu News

అభివృద్ధి–సంక్షేమం రెండూ సమాన ప్రాధాన్యతతో కొనసాగుతాయి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Garuda Telugu News

పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలి…..

Garuda Telugu News

Leave a Comment